Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ లీక్ ..సోషల్ మీడియాలో వైరల్

Divvala Madhuri suicide drama exposed
Advertisement
  • దివ్వెల మాధురి కారు ప్రమాదంలో ట్విస్ట్ 
  • అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతూ దువ్వాడతో కాల్ మాట్లాడిన మాధురి
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఫోన్ కాల్ ఆడియో
Advertisement
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పంచాయతీ వ్యవహారం రచ్చరచ్చ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి కారు పలాస లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైంది. అయితే నాడు ఇది ప్రమాదం కాదనీ, తానే ఆత్మహత్యాయత్నం చేసుకున్నానంటూ మాధురి మీడియా ముందు చెప్పింది. ఈ అంశానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

ప్రమాదం జరిగిన తర్వాత మాధురి అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతున్న క్రమంలో ఆమెతో దువ్వాడ మాట్లాడుతూ .. కావాలనే కారుతో ఢీకొట్టి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని, వాణి వేధింపులు తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా మీడియాకు చెప్పు, వైద్యులు, పోలీసులతో వ్యవహారం తాను చూసుకుంటానని మాధురికి శ్రీనివాస్ సూచించినట్లుగా ఆ ఆడియోలో ఉంది. 
Advertisement
Advertisement
Divvala Madhuri
Duvvada Srinivas
YSRCP

More Telugu News